ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ త‌గల‌నుంది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఖ‌మ్మం(Khammam) జిల్లాలో బీఆర్ఎస్‌(BRS)కు భారీ షాక్ త‌గల‌నుంది. కొత్తగూడెం(Kothagudem) మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు(Jalagam Venkatarao) బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. జలగం వెంకట్రావు నేడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)ల‌తో క‌లిసి జలగం వెంకట్రావు ఢిల్లీ(Delhi)కి చేరుకున్నట్లు తెలుస్తోంది.

మాజీ సీఎం జలగం వెంగళరావు(Jalagam Vengala Rao) కుమారుడు వెంకట్రావు. కొత్తగూడెం నుంచి 2014లో జలగం వెంకట్రావు టీఆర్ఎస్(TRS) నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateshwararao) కాంగ్రెస్(Congress) నుంచి బీఆర్ఎస్(BRS) గూటికి చేరారు. ఈసారి టిక్కెట్ జలగం వెంకట్రావుకు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రధాన నేతలు బీఆర్ఎస్ ను వీడగా.. ఇప్పుడు జ‌ల‌గం వెంకట్రావు కూడా షాక్ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల‌లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 కి 10 స్థానాలు గెల‌వాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తుంది. మ‌రి అధికార‌ బీఆర్ఎస్‌ను త‌ట్టుకుని ఏ మేర‌కు స‌త్ఫ‌లితాలు సాధిస్తుందో చూడాలి మ‌రి.

Updated On 30 Oct 2023 11:06 PM GMT
Yagnik

Yagnik

Next Story