బాల్యవివాహాలు(Child marriages) నేరమని తెలిసి కూడా కొందరు ఆ తప్పు చేస్తున్నారు. లాస్టియర్‌ ఇలాగే ఓ బాలికకు పెళ్లి చేశారు. ఇప్పుడా విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలికకు కుటుంబసభ్యులు, మధ్యవర్తులు కలిసి 33 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. మొగుడు ఆ బాలికను సరిగ్గా చూసుకోకపోవడం అటుంచి వేధింపులకు(Harassing) గురి చేయసాగాడు. పాపం ఆ పిల్ల మాత్రం ఎంతకాలం భరిస్తుంది? కుటుంబసభ్యులకు తన కష్టాలు చెప్పుకుని ఏడ్చేసింది.

బాల్యవివాహాలు(Child marriages) నేరమని తెలిసి కూడా కొందరు ఆ తప్పు చేస్తున్నారు. లాస్టియర్‌ ఇలాగే ఓ బాలికకు పెళ్లి చేశారు. ఇప్పుడా విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలికకు కుటుంబసభ్యులు, మధ్యవర్తులు కలిసి 33 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. మొగుడు ఆ బాలికను సరిగ్గా చూసుకోకపోవడం అటుంచి వేధింపులకు(Harassing) గురి చేయసాగాడు. పాపం ఆ పిల్ల మాత్రం ఎంతకాలం భరిస్తుంది? కుటుంబసభ్యులకు తన కష్టాలు చెప్పుకుని ఏడ్చేసింది. ఊర్లో విషయాలు దాగవు కదా! ఆ నోటా.. ఈ నోటా పాకేసి జగిత్యాల(Jagityala) జిల్లా బాలల కమిషన్‌(Child commission) వరకు చేరింది. విద్యార్థిని వివరాలు సేకరించిన కమిషన్‌ జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో జిల్లా అధికారులు బేలలోని బాలిక అత్తారింటికి వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో ఉంచారు. బేల పోలీసుస్టేషన్‌లో(Bela police station) బాల్య వివాహం కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 15 ఏళ్ల బాలికకు గత మార్చిలో పెళ్లి చేశారు. 33 ఏళ్ల పెళ్లికొడుకు కుటుంబీకులు కన్యాశుల్కం తీసుకున్నారట! బాలిక తల్లి ఆ ఇంటా ఈ ఇంటా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేది. దివ్యాంగుడైన తండ్రి ముంబాయిలో ఉంటున్నారు. పెళ్లయిన తర్వాత బాలిక ఒకటో రెండోసార్లు పుట్టింటికి వచ్చిందంతే! కుటుంబీకులపై బేల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద కుటుంబీకులపై కేసు నమోదు చేశామని, పోక్సో యాక్ట్‌కు సంబంధించి లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంటున్నామని బేల పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ చెప్పారు. ఇరు కుటుంబీకులతో పాటు పెళ్లికి హాజరైన వారిపై సైతం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Updated On 17 Feb 2024 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story