జగిత్యాల(Jagtial) జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో(Takkalpalli) దారుణం చోటు చేసుకుంది. ప్రేమపేరుతో ఓ బాలికను నమ్మించి ఆ పాపకు గంజాయి(Weed) అలవాటు చేసి, ఆపై లైంగికదాడికి(Sexual assault) పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఇదే పని చేశాడు ఓ బాలుడు. తన కూతురుకు గంజాయి అలవాటు చేసి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

జగిత్యాల(Jagtial) జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో(Takkalpalli) దారుణం చోటు చేసుకుంది. ప్రేమపేరుతో ఓ బాలికను నమ్మించి ఆ పాపకు గంజాయి(Weed) అలవాటు చేసి, ఆపై లైంగికదాడికి(Sexual assault) పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఇదే పని చేశాడు ఓ బాలుడు. తన కూతురుకు గంజాయి అలవాటు చేసి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. తక్కళ్లపల్లికి చెందిన ఆరెల్లి ప్రేమ్‌కుమార్‌, మల్లాపూర్‌ మండలం చిట్టాపూర్‌కు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటేశ్‌ ప్రేమిస్తున్నామంటూ బాలికకు మాయమాటలు చెప్పి గంజాయి అలవాటు చేశారు. ఆ తర్వాత బలవంతంగా లైంగికదాడి చేశారు. ఆ బాలిక పదో తరగతి చదువును మధ్యలోనే ఆపేసి ఇంట్లో ఉంటున్నది. అదే ప్రాంతంలో నివాసం ఉండే ఓ బాలుడు కూడా ప్రేమిస్తున్నానంటూ ఆ బాలికకు దగ్గరయ్యి, మత్తుపదార్థాలు ఇచ్చి లైంగిక దాడికి దిగాడు. బాలిక తండ్రి, చైల్డ్‌వెల్ఫేర్‌ అధికారులు, డీ అడిక్ట్‌ సెంటర్‌ వారి స్టేట్‌మెంట్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ్‌కుమార్‌, వెంకటేశ్‌, బాలుడు వేర్వేరుగా బాలికకు మత్తుపదార్థాలు అలవాటు చేసి లైంగికంగా వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ప్రేమ్‌కుమార్‌, వెంకటేశ్‌ నుంచి 140 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై పోక్సో యాక్ట్‌, ఎన్‌డీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

Updated On 26 March 2024 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story