వైద్య రంగంలో రోజురోజుకు డాక్టర్లు ఎన్నో అద్భుతాలు నెలకొల్పుతున్నారు.. కానీ ప్రభుత్వ ఆసుపత్రు(Govt Hospital)ల్లో మాత్రం నిర్లక్ష్యం అలాగే ఉంటుంది.. అధునాత సౌకర్యాలు లేకపోవడం వాళ్ళు రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. ఇక కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నిలక్ష్యం మరీ దారుణంగా ఉంటుంది.. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(Jagtial Govt Hospital)లో వైద్యుల నిర్లక్ష్యం ఒక మహిళా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.
వైద్య రంగంలో రోజురోజుకు డాక్టర్లు ఎన్నో అద్భుతాలు నెలకొల్పుతున్నారు.. కానీ ప్రభుత్వ ఆసుపత్రు(Govt Hospital)ల్లో మాత్రం నిర్లక్ష్యం అలాగే ఉంటుంది.. అధునాత సౌకర్యాలు లేకపోవడం వాళ్ళు రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. ఇక కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నిలక్ష్యం మరీ దారుణంగా ఉంటుంది.. తాజాగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(Jagtial Govt Hospital)లో వైద్యుల నిర్లక్ష్యం(Doctors Negligence) ఒక మహిళా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 16 నెలల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళకు డాక్టర్లు డెలివరీ చేసారు.. డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు...కడుపులో క్లాత్ ను మరచిపోయి కుట్లు వేశారు. కాగా సంవత్సరం తర్వాత నవ్యశ్రీకి తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంది. కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో క్లాత్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ చేసి క్లాత్ ని తొలగించారు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువ జరగుతుండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు.