ఎండలకు కేసీఆర్ ఆగం ఆగం ఐతున్నాడని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ ఓడిపోతామన్న భయంతో నోటీసులు ఇచ్చిందన్నారు.

ఎండలకు కేసీఆర్ ఆగం ఆగం ఐతున్నాడని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ ఓడిపోతామన్న భయంతో నోటీసులు ఇచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి దెబ్బకు మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ ఎస్సీ, ఎస్టీల‌ గురించి మాట్లాడారన్నారు. కేంద్రంలో హంగ్ లేదు.. బొంగు లేదు.. కాంగ్రెస్ దే విజయం అని ధీమా వ్య‌క్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం అవసరమా అనే చర్చ బీజేపీ నేతలు చేశారు. ఇది వాస్తవమే కదా.. రిజర్వేషన్లపై తెలంగాణలో వ్యతిరేకత వచ్చిందన్నారు. రేవంత్‌కు నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని.. బీజేపీకి ఎన్నికల్లో దెబ్బ పడుతుంది అని.. నోటీసులు ఇచ్చిందన్నారు.

కాంగ్రెస్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకూలం కాబట్టి బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఎన్నికల స్టంట్ లో భాగమే నోటీసులన్నారు. నోటీసుల‌పై లీగల్‌గా ఫైట్ చేస్తామ‌న్నారు. కేంద్రంలో హంగ్ లేదు.. బొంగు లేదన్నారు. బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. ఏడాదికి ఒక్కసారి కూడా బయటకు రాని కేసీఆర్.. రోడ్డు షో ల పేరుతో రోడ్డ్డున పడ్డారన్నారు.

అమిత్ షా, మోడీ ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారా..? రాహుల్ గాంధీ మూలంగా మోడీ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ లు వస్తున్నారని బీజేపీ కి అర్థం అయ్యింది. మోహన్ భగవత్ కూడా మాట్లాడాడు అంటే.. రాహుల్ గాంధీ క్రెడిట్ కాదా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్.. ప్రజల్ని ఎగిరెగిరి తన్నింది నువ్వే కదా.. అందుకే నీ కాళ్లు విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. 9 ఏండ్ల తర్వాత కొత్త ప్రొఫెసర్ ని పెట్టుకున్నట్టు ఉన్నాడు.. డైలాగులు బంద్ చేసుకో.. ఒక్క సీటు కూడా రాదు.. ఇప్పటికే నీ పార్టీలో టీ(T) మిస్ అయ్యిందన్నారు.

Updated On 29 April 2024 9:28 AM GMT
Yagnik

Yagnik

Next Story