తూర్పు జగ్గారెడ్డి(Jagareddy).. తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ అందరికీ బాగా తెలిసిన నాయకుడు. మరీ ముఖ్యంగా టీ కాంగ్రెస్‌లో ఆయనదో విలక్షణమైన శైలి. ఫైర్‌బ్రాండ్‌గా పేరుబడ్డ జగ్గారెడ్డి..ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ఏం మాట్లాడినా..ఏం చేసినా సంచలనమే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలపై స్పందించి..వెంటనే వాటిని పరిష్కరించేందుకు సంగారెడ్డిలో జనతా గ్యారేజీని(Janatha Garage) ఓపెన్ చేశారు.

Jagga Reddy
తూర్పు జగ్గారెడ్డి(Jagareddy).. తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ అందరికీ బాగా తెలిసిన నాయకుడు. మరీ ముఖ్యంగా టీ కాంగ్రెస్‌లో ఆయనదో విలక్షణమైన శైలి. ఫైర్‌బ్రాండ్‌గా పేరుబడ్డ జగ్గారెడ్డి..ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఆయన ఏం మాట్లాడినా..ఏం చేసినా సంచలనమే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యలపై స్పందించి..వెంటనే వాటిని పరిష్కరించేందుకు సంగారెడ్డిలో జనతా గ్యారేజీని(Janatha Garage) ఓపెన్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా.. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ముందుకొచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, కార్యర్తలకు ఎలాంటి సమస్య ఎదురైనా..ఏ పని కావాలన్నా రాంనగర్‌లోని(Ram nagar ) తన కార్యాలయం తలుపు తట్టాలని సూచించారు. నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు, బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు, గ్రామ, వార్డు నాయకులు, గెలిచినా, ఓడినా జెట్పీటీసి, ఎంపీటీసి, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు..ఎవరైనా సరే ఎలాంటి తారతమ్యం లేకుండా సమస్యలను పరిష్కింరించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తు్న్నారు. ఉద్యోగాలు, బదిలీలు, ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన పనుల కోసం తమ కార్యాలయ సిబ్బంది నర్సింహులు, రఘు, వెండికోల్ మాణిక్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను సంప్రదించాలని కోరారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయం తెరిచి ఉంటుందని చెప్పారు. ఏ సమస్య ఏదైనా లిఖితపూర్వక ఫిర్యాదులను కార్యాలయంలో అందజేయాలని సూచిస్తున్నారు. నేరుగా వెళ్లి ఆయాశాఖల్లో ఫిర్యాదు పత్రాలు అందజేసినా..ఆ వివరాలను తమ సిబ్బంది అందజేస్తే..అవి ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తారని చెబుతున్నారు. అలాగే..నియోజకవర్గంలో ఎల్ఓసీలతోపాటు హైదరాబాద్ ఆస్పత్రుల్లో ఎలాంటి ఎమర్జెన్సీ వైద్యకోసమైతే కార్యాలయ సిబ్బంది సురేష్‌ను (+918977460438), సంగారెడ్డి పట్టణ ఆస్పత్రుల విషయంలో మహేందర్‌ను ( 8790254831) సంప్రదించాలని సూచించారు జగ్గిరెడ్డి. నియోజకవర్గ ఆత్మబంధువులైన ప్రజలకు తన భార్య నిర్మల కూడా ( 9440606826) అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమస్యలపై నేరుగా ఫోన్ చేసి మాట్లాడొచ్చని సూచించారు.
