వరంగల్(Warangal), ఖమ్మం(Khamma), నల్లగొండ(Nalgonda) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) పోటీచేస్తున్న అందరిలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)కి చెందిన రాకేశ్ రెడ్డే(Rakesh Reddy) మెరుగైన అభ్యర్థి అని మాజీమంత్రి, స్థానిక శాసన సభ్యులు గుంటకండ్ల జగదేశ్ రెడ్డి(Jagadeesh Reddy) చెప్పారు.
వరంగల్(Warangal), ఖమ్మం(Khamma), నల్లగొండ(Nalgonda) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) పోటీచేస్తున్న అందరిలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)కి చెందిన రాకేశ్ రెడ్డే(Rakesh Reddy) మెరుగైన అభ్యర్థి అని మాజీమంత్రి, స్థానిక శాసన సభ్యులు గుంటకండ్ల జగదేశ్ రెడ్డి(Jagadeesh Reddy) చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఆయన సూర్యపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సువెన్ కంపెనీ లలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. విద్యతో పాటు విజ్ఞానంతో కూడిన మంచి అభ్యర్థిని గెలిపించుకుని చైతన్యాన్ని నిరూపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్(KCR) నాయకత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామన్న కాంగ్రెస్(Congress) మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అసలు అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చూపించాలని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. ఉద్యోగాలిచ్చామని నిస్సిగ్గుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అసంబద్ధ నిబంధనలు పెట్టి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారని తెలిపారు. 90 శాతం దొడ్డు వడ్లు పండుతుంటే సన్న వడ్లకే బోనస్ అనడం హాస్యాస్పదం అన్నారు. సన్న వడ్లుకు బయట బోనస్ కంటే ఎక్కువ ధర పలుకుతుంటే ప్రభుత్వానికి ఎలా అమ్ముతారన్నారు. ఒక్క రూపాయి బోనస్ ఇచ్చే ఉద్దేశం లేక కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మేము బోనస్ ఇస్తామన్నా రావట్లేదని రైతుల పై నెపం పెట్టాలని చిల్లర ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఒక్కొక్క హామీలు తేలిపోతున్నాయని, ఎన్నికల ముందు కాంగ్రెస్ మాయమాటలు నమ్మారు కాని ఇప్పుడు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు. రాకేశ్ రెడ్డిని గెలిపించి ప్రభుత్వం పై ఉన్న నిరసనను ప్రజలు తెలియజేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ(Telangana)ను ఆంధ్రా(Andhra)లో కలపాలని కొందరు పిచ్చి కలలు కంటున్నారని, వారి కలలు ఎప్పటికి నిజం కావని మాజీ మంత్రి అన్నారు. మరో మారు మాయమాటలు నమ్మి కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ప్రశ్నించే గొంతుకే ఉండదన్నారు. అన్ని రంగాల పట్టభద్రుల సమస్యల పై కొట్లాడే విద్యావంతుడు ప్రశ్నించే గొంతుక రాకేశ్ రెడ్డి గెలుపు ఖాయమైనట్లేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతీ ఒక్క గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ట్రై కార్ మాజీ చైర్మన్ రామచందర్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తాహెర్ పాషా, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.