మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఖమ్మంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

మాజీ ఎంపీ, పాలేరు(Paleru) కాంగ్రెస్(Congress) అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఖమ్మం(Khammam)లోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎనిమిది వాహనాలలో వ‌చ్చిన‌ ఐటీ అధికారులు.. సోదాలు నిర్వ‌హిస్తున్నారు. పొంగులేటి నివాసంలోకి వెళ్లిన వెంట‌నే అధికారులు.. ఆయ‌న‌ సిబ్బంది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌యాచారం. భారీగా నగదు ఉందన్న పక్క సమచారంతో సోదాలు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు(Paleru) నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి(Dayakar Reddy) బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం రూరల్ మండలంలోని నాయుడు పేట జంక్షన్ నుంచి కాల్వొడ్డు ర్యాలీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నామినేషన్(Nomination) దాఖలు చేస్తారని తెలిపారు.

Updated On 8 Nov 2023 10:32 PM GMT
Yagnik

Yagnik

Next Story