తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేత, చెన్నూర్ అభ్యర్థి జి. వివేకానంద్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) వేళ ఐటీ సోదాలు(IT Raids) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల బీజేపీ(BJP) నుంచి కాంగ్రెస్(COngress)లో చేరిన నేత, చెన్నూర్ అభ్యర్థి జి. వివేకానంద్(Vivekanandh) ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్(Hyderabad) సహా మంచిర్యాల్(Mancherial) జిల్లాలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు.
వివేక్ ముఖ్య అనుచరుల ఇళ్లు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల కోసం పెద్దమొత్తంలో డబ్బు దాచారన్న ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తున్నారు.
వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వివేక్ వెంకట స్వామి నివాసం వద్దకు చేరుకు న్నారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చేసుకొని ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. వివేక్ కు ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.