మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) బంధువు ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారుల ప్రదీప్‌రెడ్డి ఇంటిలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 7.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం ఎన్నికల కోసమే ఈ డబ్బును ఉంచారాఅనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) బంధువు ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారుల ప్రదీప్‌రెడ్డి ఇంటిలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 7.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం ఎన్నికల కోసమే ఈ డబ్బును ఉంచారాఅనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్‌రెడ్డి సహా రెడ్డి ల్యాబ్ డైరెక్టర్ కోట్ల నరేందర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంట్లోనూ రూ. 7.50 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైన నాటి నుంచి ఐటీ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గతంలోనూ మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి సబిత టార్గెట్‌గా ఐటీ సోదాలు జరిగాయి. పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

అయితే ఐటీ అధికారులు హైదరాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వ్యాపార, రాజకీయరంగాలకు చెందిన పలువురి ఇళ్లే లక్ష్యంగా ముప్పేట దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఫార్మా, రియల్‌ఎస్టేట్‌ రంగాల వ్యాపారులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీస్‌లలోనూ తనిఖీలు నిర్వహించారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్‌సీపురం, వట్టినాగులపల్లి, గచ్చిబౌలిలోని మైహోం భుజాలో అధికారులు దాడులు నిర్వహించారు.సీఆర్పీఎఫ్‌ జవాన్ల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. ఎన్నికల ఉండడంతో పలువురు రాజకీయ నేతలకు, పలు ఫార్మా కంపెనీల నుంచి భారీగా నగదు చేరవేస్తున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం ఉందట. ఈ సమాచారంతోనే వరుసగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు.

Updated On 15 Nov 2023 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story