తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల మంత్రి సబిత బంధువుల ఇళ్లల్లో దాడులు జరుగగా.. ఈ ఉదయం 4 గంటల నుంచే 40 బృందాలు రంగంలోకి దిగాయి.
తెలంగాణ(Telangana)లో ఐటీ దాడులు(IT Raids) కలకలం రేపుతున్నాయి. ఇటీవల మంత్రి సబిత(Minister Sabitha Indra Reddy) బంధువుల ఇళ్లల్లో దాడులు జరుగగా.. ఈ ఉదయం 4 గంటల నుంచే 40 బృందాలు రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లోని విజం శ్రీధర్ రావు(Sridhar Rao) ఇంట్లో.. మిర్యాలగూఢ(Miryalaguda)లోని వైదేహి టౌన్ షిప్(Vaidehi Township) లోనూ ఐటీ అధికారుల సోదాలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. శ్రీధర్ కు మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు(Nallamothu Bhaskar Rao) అనుచరుడనేది వార్తల సారాంశం. ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బులు శ్రీధర్ వద్ద నిల్వ ఉంచారన్న అరోపణలతో ఐటీ అధికారులు అకస్మతిక తనిఖీలు చేపట్టారని కథనాలు పేర్కొన్నాయి.
అయితే.. దాడులపై భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తన కార్యాలయాల్లో ఎలాంటి సోదాలు జరగలేదని ఖండించారు. తనపై ఐటీ దాడులు జరిగినట్టు ప్రచారం జరుగుతుందని అన్నారు. శ్రీధర్ అనే మిల్లర్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు జరిగినట్లు ధృవీకరించారు. అయితే మిర్యాలగూడలోని ప్రతి మిల్లర్ తనకు తెలియదని.. తనతో ప్రత్యక్ష సంబంధాలు లేవని పేర్కొన్నారు.
పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కూడా ఆయన ఖండించారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కార్యాలయాలపై ఎలాంటి సోదాలు జరగలేదని హైదరాబాద్‌లోని ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగం ఖండించింది
వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నియోజవర్గాలకు పెద్ద ఎత్తున నగదు(Money) చేరిందన్న అనుమానంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రతీ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.