బీఆర్ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన సిబ్బంది ఇళ్లల్లో కూడా బుధవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

IT Raids at the house of BRS MLA Pailla Shekhar Reddy
బీఆర్ఎస్(BRS) నేత, భువనగిరి(Bhuvanagiri) ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ శాఖ(Income Tax) అధికారులు సోదాలు(Raids) జరుపుతున్నారు. హైదరాబాద్(Hyderabad)లోని ఆయన ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన సిబ్బంది ఇళ్లల్లో కూడా బుధవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ(Hill Land Technologies Company), మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్(Mainland Digital Technologies)లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా(Vanitha) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
