తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

IT raids at Congress candidate’s house in Alampur
తెలంగాణ ఎన్నికల(Telangana Elections) నేపథ్యంలో ఐటీ దాడులు(IT Raids) కలకలం రేపుతున్నాయి. తాజాగా అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అలంపూర్(Alampur) శాంతి నగర్ లో సంపత్ కుమార్ ఇంటికి చేరుకున్న ఐటీ అధికారులు.. తాళాలు పగలకొట్టి తనిఖీలు చేపట్టారు. అయితే ఈ సోదాలలో ఎలాంటి డబ్బులు, వస్తువులు దొరకలేదని సమాచారం. ఐటీ అధికారుల తీరు పట్ల భయభ్రాంతులకు గురైన సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి(Mahalakshmi) అస్వస్థతకు గురయ్యారు. ఆమె సృహ తప్పి పడిపోవడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కాంగ్రెస్(Congress) శ్రేణులకు సమాచారమందడంతో అలంపూర్‌లో గందరగోళం నెలకొంది.
