గత కొన్నేళ్లుగా అదానిపై ఒంటికాలితో లేచి ఎగిరెగిరి పడే రాహుల్‌గాంధీ(rahul gandhi) వ్యవహారాన్ని చూస్తున్నాం.
గత కొన్నేళ్లుగా అదానిపై ఒంటికాలితో లేచి ఎగిరెగిరి పడే రాహుల్‌గాంధీ(rahul gandhi) వ్యవహారాన్ని చూస్తున్నాం. అదానీకి(Adani) వ్యతిరేకంగా దేశ స్థాయిలో పార్టీ ఏ విధంగా పోరాడుతుంతో మనం చూస్తూనే ఉన్నాం. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) అదానికి దోచిపెడుతున్నారని పార్లమెంట్ లోపల, బయట కొట్లాడుతూనే ఉన్నారు. అయితే తెలంగాణలో కూడా గత పదేళ్లుగా అదానీని కేసీఆర్(KCR) దగ్గరికి రానియ్యలేదు. విద్యుత్ ప్లాంట్లు పెడతామని అదాని కంపెనీలు ముందుకొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చారు. అయితే కేసీఆర్ దిగిపోయిన తర్వాత అదాని పేరు రాష్ట్రంలో మారుమోగిపోతుంది. దావోస్ పర్యటన జరిగిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM revanth reddy) అదానీతో ఒప్పందాలు చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ దేశంలో అతడిని వ్యతిరేకిస్తే ఆ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అదానీని ఎందుకు నెత్తిన పెట్టుకొందన్న ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటికే పాత బస్తీలో(Old City) విద్యుత్ బిల్లుల(Current bill) వసూళ్లను అదనీ సంస్థకు అప్పగించారు.
అయితే తాజాగా అదానీ పెట్టుబడుల వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు(Sreedhar Babu) మీడియా మిత్రులతో మాట్లాడారు. అదానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తామని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఢిల్లీలో రాహుల్‌గాంధీ అదానీని వ్యతిరేకిస్తున్నారు కదా అని మీడియా ప్రశ్నిస్తే విచిత్రమైన సమాధానం ఇచ్చారు. 'అవును పార్టీ పరంగా అదానీని వ్యతిరేకిస్తాం, ప్రభుత్వ పరంగా స్వాగతిస్తామని చెప్పారు. దీంతో అక్కడున్న మీడియా వాళ్లంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాయారట. ఇదెక్కడి లాజిక్కో అర్థం కావడంలేదని కొందరు జర్నలిస్టులు వాపోయారు.