Duddilla Sridharbabu : మొదటి సమావేశంలోనే అధికారులపై మంత్రి ఆగ్రహం
ఐటీ శాఖ మంత్రి(IT minister) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridharbabu) కార్యరంగంలోకి దూకారు. అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటి సమావేశంలోనే(Meeting) వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు మంత్రి.

Duddilla Sridharbabu
ఐటీ శాఖ మంత్రి(IT minister) దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Duddilla Sridharbabu) కార్యరంగంలోకి దూకారు. అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటి సమావేశంలోనే(Meeting) వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు మంత్రి. సోషల్ మీడియాలో(Social media) తప్పుడు ప్రచారాలు చేయవద్దని, మీడియాకు లీకులు ఇవ్వకూడదని గట్టిగా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు అధికారులు ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి పనులు మానేయాలన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటీ సెక్రటరీని, అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు.
