రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది.

రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి మూడు వారాలకిందటే పెళ్లయింది. ఇంతలోనే ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా మారాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన అరుణ్‌(Arun) (28) ఇదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని (21)తో మూడు వారాల క్రితం పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరు హైదర్‌గూడ(Hyderguda)లో అద్దె ఇంట్లోకి దిగారు. అరుణ్‌ రాత్రి షిఫ్ట్‌లో వర్క్‌ ఉంది.. ఆయన భార్య ఉదయం ఆఫీస్‌ నుంచి తిరిగి వచ్చింది. గది తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు బలవంతంగా డోర్‌ ఓపెన్ చేసి చూడగా అరుణ్‌ ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. అరుణ్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story