తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) దగ్గరపడుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు(IT rides) కలకలం రేపుతున్నాయి. మహేశ్వరం(Maheswaram) కాంగ్రెస్‌(Congress) అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(Lakshma Reddy) ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇల్లు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్‌ఆర్ ఫామ్‌ హౌస్‌లో(Farm house) ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) దగ్గరపడుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు(IT rides) కలకలం రేపుతున్నాయి. మహేశ్వరం(Maheshwaram) కాంగ్రెస్‌(Congress) అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(Lakshma Reddy) ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయన ఇల్లు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న కేఎల్‌ఆర్ ఫామ్‌ హౌస్‌లో(Farm house) ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల కిందటే తుక్కుగూడలో పార్టీ కార్యాలయాన్ని కేఎల్ఆర్‌ ప్రారంభించారు. శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడలో ఉన్న అక్బర్‌బాగ్‌లో కేఎల్‌ఆర్‌ ఫామ్‌ హౌస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ రంగారెడ్డి పరిసరాలలో పలు ఫామ్‌ హౌస్‌లు, గచ్చిబౌలి సమీపంలోని ఎన్‌సీసీలో కూడా ఆయనకు విల్లా ఉన్నట్లు సమచారం. మరోవైపు కాంగ్రెస్‌ నేత పారిజాత నర్సింహారెడ్డి(Narsimha Reddy) ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పారిజాత(Parijatha) కూతురు ఫోన్‌ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో(Delhi) ఉన్నారు. బడంగ్‌పేట్‌ కార్పొరేటర్‌గా ఉన్న పారిజాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాకపోతే టికెట్‌ దక్కలేదు. పది ప్రాంతాలలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.

Updated On 2 Nov 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story