తెలంగాణలో(Telangana) ఎన్నికల హడావుడి మొదలయ్యి చాన్నాళ్లయ్యింది. ఆల్‌రెడీ నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. ఇలాంటి కీలకసమయంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎంతో యాక్టవ్‌గా ఉండే విజయశాంతి ఇప్పుడు సైలెంట్‌గా ఎందుకున్నారు? కాంగ్రెస్(Congress) పార్టీనే ఆమెను దూరం పెట్టిందా? లేక కాంగ్రెస్‌కే విజయశాంతి దూరంగా ఉంటున్నారా? అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీజేపీలో(BJP) ఇమడలేక సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు కాంగ్రెస్‌లో చేరారు విజయశాంతి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది
తెలంగాణలో(Telangana) ఎన్నికల హడావుడి మొదలయ్యి చాన్నాళ్లయ్యింది. ఆల్‌రెడీ నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. ఇలాంటి కీలకసమయంలో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎంతో యాక్టవ్‌గా ఉండే విజయశాంతి ఇప్పుడు సైలెంట్‌గా ఎందుకున్నారు? కాంగ్రెస్(Congress) పార్టీనే ఆమెను దూరం పెట్టిందా? లేక కాంగ్రెస్‌కే విజయశాంతి దూరంగా ఉంటున్నారా? అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? బీజేపీలో(BJP) ఇమడలేక సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు కాంగ్రెస్‌లో చేరారు విజయశాంతి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీభవన్‌లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమంలో ఆమె కనిపించడం మానేశారు. నాయకుల నోటి నుంచి కూడా విజయశాంతి పేరు వినిపించడం లేదు. కీలకమైన లోక్ సభ ఎన్నికలు(Lok Sabha) జరుగుతున్న ఈ తరుణంలో ఆమె పార్టీకి దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన వార్తలు రావడం లేదు. హెల్త్ బాగోలేకపోవడం వల్ల బయటకు రావడం లేదా అంటే అలాంటి వార్త మీడియాలో రాలేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు ఆమెను కలవలేదు. ప్రచారానికి ఆమెను ఆహ్వానించినట్టు దాఖలాలు లేవు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అధినాయకత్వం ఆమెకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు తనకు మెదక్ లోక్‌సభ టికెట్ కావాలనే షరత్ విధించారట విజయశాంతి. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు ఎంత సీనియర్లు అయినా కంపల్సరీగా అప్లికేషన్ పెట్టుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన మీదటే అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అధిష్టానం. విజయశాంతి ఎలాంటి అప్లికేషన్‌ను పెట్టుకోలేదట. అందుకే ఆమె పేరును పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. తన పాపులారిటీని, సీనియారిటీని గుర్తించకపోవడంతో ఆమె అలిగారట! మరి విజయశాంతి ఇప్పుడేం చేయబోతున్నారు? పుష్కరకాలం తర్వాత ఆమె మళ్లీ బీఆర్‌ఎస్ గూటికి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న కథనాలలో నిజమెంత? విజయశాంతి స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు