తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కొన్ని రోజులుగా సెక్రటేరియట్(secretariat) మొహం చూడటం లేదు. సమీక్షలు గట్రాలు అన్ని కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ నుంచే కానిస్తున్నారు. అందుకు కారణం సచివాలయం ఆయన వాస్తకు తగినట్టు లేకపోవడమేనట! మార్పులు చేర్పులు చేసేంత వరకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లో అడుగు పెట్టడం కష్టమేనంటున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వాస్తు మార్పులు(Vastu changes) మొదలయ్యాయట! ఇంటీరియర్‌ డిజైన్‌తో(Interior) పాటు ఫర్నిచర్‌లో కూడా మార్పులు చేయిస్తున్నాని సమాచారం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కొన్ని రోజులుగా సెక్రటేరియట్(secretariat) మొహం చూడటం లేదు. సమీక్షలు గట్రాలు అన్ని కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ నుంచే కానిస్తున్నారు. అందుకు కారణం సచివాలయం ఆయన వాస్తకు తగినట్టు లేకపోవడమేనట! మార్పులు చేర్పులు చేసేంత వరకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లో అడుగు పెట్టడం కష్టమేనంటున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వాస్తు మార్పులు(Vastu changes) మొదలయ్యాయట! ఇంటీరియర్‌ డిజైన్‌తో(Interior designs) పాటు ఫర్నిచర్‌లో కూడా మార్పులు చేయిస్తున్నాని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆరో అంతస్థులో పనులు ప్రారంభమయ్యాయట! ఇప్పటికే రేవంత్‌రెడ్డి న్యూమరాలజీ, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా అనేక మార్పులు చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి తొమ్మిదో నంబర్‌ను లక్కీ నంబర్‌గా భావిస్తారు. అందుకే కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తొమ్మిదికి పెంచుకున్నారు. అన్ని వాహనాల నంబర్‌ప్లేట్లపై తొమ్మిది నంబర్ వచ్చేలా చూసుకున్నారు.

నిజానికి సెక్రటేరియట్‌లో కూడా తన కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్థులోకి మార్చాలని అనుకున్నారట! ఇందుకోసం చాలా సార్లు తొమ్మిదో అంతస్థుకు వెళ్లి పరిశీలించారట! టెక్నికల్‌గా అది సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో ఆలోచన విరమించుకున్నారట! ఇక ఆయనకు బ్లాక్‌ కలర్‌ ఓ సెంటిమెంట్‌. అందుకే కాన్వాయ్‌ను నలుపురంగులోకి మార్పించుకున్నారు. వాస్తు మార్పులకు అనుగుణంగా ఇప్పటికే సెక్రటేరియట్‌లోకి రాకపోకల మార్గాన్ని కూడా మార్చుకున్నారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్నే వాడారు. ఇప్పుడు వాస్తు ప్రకారం మార్పులు చేయించుకున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తున్నారు. ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వా రా బయటికి వెళ్లిపోతున్నారు.

గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయించుకుంటే ఇదే కాంగ్రెస్‌ పార్టీ అప్పుడు గాయ్‌ గత్తర చేసింది. పాత సెక్రటేరియట్‌ను కూలగొట్టి కొత్తది కడుతున్నప్పుడు కూడా తీవ్ర విమర్శలు చేశారు. సెక్రటేరియట్‌గా వాస్తు దోషం ఉంటుందా? వాస్తు బాగోలేకపోతే కుట్రలు జరుగుతాయన్న నమ్మకం మన రాజకీయ నాయకులకు ఉందా? మనిషిని బట్టి వాస్తు మారుతూ ఉంటుందా? పాత సెక్రటేరియట్‌లో తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేయలేదా? రాజశేఖర్‌రెడ్డి ఆరు సంవత్సరాలు పాలన చేయలేదా? అలాగే నాదెండ్ల భాస్కర్‌రావు నెల రోజులకే పదవిని పోగొట్టుకున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో ఏ ముఖ్యమంత్రి కుదురుగా రెండేళ్లు పాలన చేయలేకపోయారు. వారిలోనూ సమర్థులున్నారు. పరిపాలనదక్షులనే పేరు గడించినవారూ ఉన్నారు. ఇదే సెక్రటేరియట్‌ ఉన్నప్పుడే కదా అలిపిరి ఘటన జరిగింది. చంద్రబాబు క్షేమంగా బయటపడలేదా? ఇదే సెక్రటేరియట్‌ ఉన్నప్పుడే కదా రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో కన్నుమూసింది. అదృష్ట దురదృష్టాలు వ్యక్తులను బట్టే ఉంటాయి తప్ప సెక్రటేరియట్‌ వాస్తును బట్టి కాదు. వ్యక్తులకు జ్యోతిష్యంపై నమ్మకం ఉంటే ఉండవచ్చు.

దాన్ని ఎవరూ తప్పుపట్టరు. అంతే కాని భవనానికి జ్యోతిష్యం కుదరదు. ఆ మాటకొస్తే ప్రాంతాలను బట్టి వాస్తు కూడా మారుతుంటుంది. తమిళనాడులో ఇంటికి దక్షిణంవైపు ద్వారం ఉంటే చాలా మంచిదంటారు. మన దగ్గర మాత్రం సౌత్‌ ఫేసింగ్‌ అస్సలు పనికి రాదంటారు. సౌత్‌ ఫేసింగ్‌ ఉన్న ఇంటిని చాలా మంది తీసుకోరు. తమిళులకు అమావాస్య చాలా మంచిది. శుభకార్యాలు అమావాస్య రోజున చేసుకుంటారు. మనకేమో అమావాస్య అశుభం. వెహికిల్స్‌ రిజిస్ట్రేషన్‌ విషయానికి వస్తే నంబర్‌ ప్లేట్‌లోని అన్ని నంబర్లు కలిపితే తొమ్మిది వచ్చిందనుకోండి. యాక్సిడెంట్ అవుతుందనేది తమిళుల నమ్మకం. అలాంటి వెహికిల్స్‌కు రీసేల్ అంతగా ఉండదు. మరి మనమేమో తొమ్మిది వచ్చేట్టు చూసుకుని మరీ కొనుక్కుంటాం! ప్రజా ధనంతో ఒకరు కట్టిస్తారు. ఒకరొచ్చి కూలగొడుతుంటారు. ఏమిటిది? ప్రభుత్వాధినేతల బతుకులు బాగుపడితే చాలా? ప్రజల బతుకులు బాగుపడకూడదా? వ్యక్తిగతంగా ఎంత ఖర్చు అయినా పెట్టుకోవచ్చు. ఎంత సమయాన్ని వృధా చేసుకున్నా ఫర్వాలేదు. వాళ్ల డబ్బు. వాళ్ల ఇష్టం. కానీ ప్రభుత్వం సొమ్ముతో ఇవన్నీ చేస్తానంటేనే ఇబ్బంది. ఎవరైనా మంత్రి కాగానే తమ జాతకాలకు అనుగుణంగా ఛాంబర్‌లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు, పూజలు చేయిస్తున్నారు, ముఖ్యమంత్రులు ఇంకాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వాళ్ల అధికార నివాసాల్లో కోట్లాది రూపాయలతో మార్పులు జరుగుతున్నాయి. ఇదే అవాంఛనీయం. అసంబద్ధం. పాలకులు ఇప్పటికైనా వాస్తుపై దృష్టి సారించడం మానేసి పరిపాలనపై దృష్టి పెడితే అందరికీ మంచిది.

Updated On 11 Jun 2024 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story