తెలంగాణ బీజేపీ(Telangana BJP)కి కొత్త అధ్యక్షుడు రానున్నారా..? ఎన్నికల సమయం వరకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని కిషన్‌రెడ్డి(Kishan Reddy) అధిష్టానికి గతంలోనే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు బీజేపీ హైకమాండ్ కూడా సానుకూలంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగేందుకు కిషన్‌రెడ్డి సుముఖంగా లేరని..
తెలంగాణ బీజేపీ(Telangana BJP)కి కొత్త అధ్యక్షుడు రానున్నారా..? ఎన్నికల సమయం వరకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని కిషన్‌రెడ్డి(Kishan Reddy) అధిష్టానికి గతంలోనే స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు బీజేపీ హైకమాండ్ కూడా సానుకూలంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగేందుకు కిషన్‌రెడ్డి సుముఖంగా లేరని.. దీంతో పాటు తెలంగాణలో బీజేపీ పొందిన ఫలితాలు, రాష్ట్ర బీజేపీలో పరిణామాలను అధిష్టానంపై దృష్టి సారించందని అంటున్నారు. అయితే తాజా ఎన్నికల్లో గెలుపొందిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో సీఎంలను నియమించే పనిలో బీజేపీ హైకమాండ్ ఉంది. వీరి ప్రమాణస్వీకారం తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు రాష్ట్ర సీఎంలు ప్రమాణస్వీకారం చేయగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు.
అయితే కొందరు నేతలు మాత్రం లోక్‌సభ ఎన్నికల వరకు కిషన్‌రెడ్డే కొనసాగుతారని అంటుననారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన బీజేపీ ఈ సారి అంతకన్నా ఎక్కువే సాధించి తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినప్పటికీ.. 8 సీట్లకే పరిమితం కావడంతో బీజేపీ అధిష్టానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌తో బీజేపీ లాలూచీ పడిందని కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసి కొంత వరకు సఫలమైందని.. కవిత అరెస్ట్, కేసీఆర్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించడంతో ఆ వార్తలకు బలం చేకూరిందని అంటున్నారు. ముఖ్యంగా బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే దాదాపు 25 స్థానాలకుపైగా గెలిచే అవకాశం ఉందని.. ఈ పరిస్థితుల్లో బీజేపీ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చేదని కట్టర్ బీజేపీ వాదులు విమర్శిస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్నసికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ ఒక్క దాంట్లో కూడా గెలవకపోవడంతో.. తన నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టాలని కిషన్‌రెడ్డి భావిస్తున్నారు.
అయితే కొత్త అధ్యక్షుడిగా మళ్లీ బండి సంజయ్(Bandi Sanjay) పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. ఈ జాబితాలో ఎంపీ అర్వింద్, మరో నేత ఈటల రాజేందర్ కూడా ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్‌కే మరోసారి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.