ఢిల్లీ మద్యం కేసులో(Delhi Liquor Case) 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) బెయిల్‌(Bail) వచ్చింది.

ఢిల్లీ మద్యం కేసులో(Delhi Liquor Case) 165 రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) బెయిల్‌(Bail) వచ్చింది. ఈనెల 27న బెయిల్‌ రావడంతో ఆమె నిన్న హైదరాబాద్‌లోని సొంత ఇంటికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో కవిత అభిమానులు, బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులు ఆమెకు స్వాగతం తెలిపారు. అయితే ఈరోజు కేసీఆర్‌(KCR) వ్యవసాయక్షేత్రానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే కవితకు బెయిల్‌ రాకపై రాజకీయ నేతలు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్‌(Congress) కలిసిపోయినందునే కవితకు బెయిల్‌ వచ్చిందని బండి సంజయ్‌(Bandi sanjay) వ్యాఖ్యానించారు. బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌ విలీనం వల్లే కవితకు బెయిల్‌ వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth reddy) వ్యాఖ్యానించారు. ఇదే కేసులో ఉన్న మనీష్‌ సిసోడియాకు(Manish Sisodia), కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) బెయిల్‌ ఎందుకు రాలేదని రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్‌ నేతలు కూడా దీనికి దీటుగా సమాధానం ఇచ్చారు. ఓటుకు నోటు కేసు జాప్యం కావడానికి బీజేపీకి రేవంత్‌తో చీకటి ఒప్పందమే కారణమని విమర్శించారు. మనీష్‌ సిసోడియాకు బెయిల్ వస్తే తప్పుడు కేసు అని చెప్పే రాహుల్‌గాంధీ, అదే కేసులో కవితకు బెయిల్‌ వస్తే ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. అయితే కవిత బెయిల్ వెనుక చంద్రబాబు(Chandrababu) ఉన్నారన్న వార్తలు కూడా బయట గుప్పుమంటున్నాయి. చంద్రబాబుతో కలిసి బీజేపీ పెద్దలతో కేటీఆర్‌(KTR) లాబీయింగ్‌ చేయించారని అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబు ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారు కనుక చంద్రబాబుతో చెప్పిస్తే బెయిల్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున తెరవెనుక ఆయన మద్దతు తీసుకున్నారని సమాచారం. కవిత అనారోగ్యం దృష్ట్యా, మహిళ అన్న సెంటిమెంట్‌ కారణంగా చంద్రబాబు కూడా ఆమె పట్ల సానుకూలంగా వ్యవహరించినందునే బెయిల్ వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలను బీఆర్‌ఎస్‌ నేతలు ఖండిస్తున్నారు. కవితది తప్పుడు కేసు అన్న విషయం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలుస్తోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story