రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ శ్రీకారం చుట్టింది. కార్య‌క్ర‌మంలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్నారు. అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు.. పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకూ ప్రతి ఒక్క కార్యకర్త ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

రాష్ట్రవ్యాప్తంగా నేడు ‘‘ఇంటింటికీ బీజేపీ(Intintiki BJP)’’ కార్యక్రమానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ శ్రీకారం చుట్టింది. కార్య‌క్ర‌మంలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్నారు. అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) మొదలు.. పోలింగ్ బూత్(Polling Booth) అధ్యక్షుల వరకూ ప్రతి ఒక్క కార్యకర్త ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్ లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోదీ(Narendra Modi) 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేయ‌నున్నారు.

ఇంటింటికీ బీజేపీలో భాగంగా అధ్య‌క్షుడు బండి సంజయ్.. కరీంనగర్(Karimnagar) లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్ లోని ప్రజలను కలవనున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy) అంబర్ పేట(Amberpet), నాంపల్లి(Nampally), జూబ్లీహిల్స్(Jubilihills) నియోజకవర్గాల్లో మోదీ తొమ్మిదేళ్ళ పాలనపై ప్రజలను కలిసి వివ‌రించనున్నారు. ఎంపీ లక్ష్మణ్(MP Laxman) ముషీరాబాద్(Musheerabad) అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం కొనసాగనుంది.

Updated On 21 Jun 2023 9:53 PM GMT
Yagnik

Yagnik

Next Story