ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 19న ముగిసే పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ, 5,02,260 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సహా మొత్తం 9,80,978 మంది హాజరుకానున్నారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్(Intermediate Exams) 2024 బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 19న ముగిసే పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ, 5,02,260 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సహా మొత్తం 9,80,978 మంది హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి ఒక ముందు అంటే ఉదయం 8 గంటలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45 గంటలలోపు విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోని తమ సీట్లలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఉదయం 8.45 నుండి 9 గంటల వరకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలతో TSBIE పరీక్షల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు మొత్తం 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉంటారని.. కేంద్రాల్లో పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు 200 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసింది.
మరోవైపు కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద రాచకొండ పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న పరీక్షల కోసం పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.