హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఇంటర్ కాలేజీలు జూన్ 1వ తేదీ శనివారం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఇంటర్ కాలేజీలు జూన్ 1వ తేదీ శనివారం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TG BIE) విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు జూన్ 1న ప్రారంభం కావాలి. విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండగా.. 75 సెలవులు ఉన్నాయి.
ఒకవైపు దాదాపు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశాయి. అడ్మిషన్ ప్రక్రియలో ప్రభుత్వ సంస్థలు కాస్త వెనుకబడి ఉన్నాయి. కాలేజీల్లో మొదటి దశ అడ్మిషన్లకు జూన్ 30 వరకు గడువు ఉంది. TG BIE ఇప్పటివరకు హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 2,353 ఇంటర్ కాలేజీలకు అఫిలియేషన్లు మంజూరు చేసింది. వీటిలో 421 ప్రభుత్వ కళాశాలలు, 601 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 177 జూనియర్ కళాశాలలు ఉండగా.. వాటిలో 22 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.