తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Inter Exams) మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు జరిగాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తారీఖు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరగగా.. టెన్త్ పరీక్షలప్పుడు కాస్తా గందరగోళం నెలకొంది. మొత్తానికి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫలితాల(Results)కై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ(Education Department) ఏర్పాట్లు చేస్తోంది. మే 10న […]
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Inter Exams) మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు జరిగాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తారీఖు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరగగా.. టెన్త్ పరీక్షలప్పుడు కాస్తా గందరగోళం నెలకొంది. మొత్తానికి పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫలితాల(Results)కై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ(Education Department) ఏర్పాట్లు చేస్తోంది. మే 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్(EAMCET) అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. మరోపక్క నీట్(NEET), జేఈఈ(JEE) ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా ఇంటర్ పరీక్ష ఫలితాల(Inter Results)ను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది.
మరోపక్క టెన్త్ ఫలితాల(Tenth Results) వెల్లడి కోసం కూడా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. తెలంగాణ(Telangana)లో జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యాబోధన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.