India Today TS Election Survey : తెలంగాణలో రాబోయేది హంగ్ అసెంబ్లీనే!.. ఇండియా టుడే అంచనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) సమయం దగ్గరపడింది. మరో 40 రోజులు మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేకపోయినా వివిధ సర్వేల అంచనాలు మాత్రం కాంగ్రెస్‌వైపే ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఇండియా టుడే(India Toady) ఒపీనియన్ పోల్‌తో(Opinion Poll) విడుదల చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్‌కు(Congress) ఆధిక్యమైతే కనిపిస్తున్నది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లను సాధించలేకపోతున్నది. రాబోయేది హంగ్ అసెంబ్లీనేనని ఇండియా టు డే సర్వే గట్టిగా చెబుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) సమయం దగ్గరపడింది. మరో 40 రోజులు మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేకపోయినా వివిధ సర్వేల అంచనాలు మాత్రం కాంగ్రెస్‌వైపే ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఇండియా టుడే(India Toady) ఒపీనియన్ పోల్‌తో(Opinion Poll) విడుదల చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్‌కు(Congress) ఆధిక్యమైతే కనిపిస్తున్నది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లను సాధించలేకపోతున్నది. రాబోయేది హంగ్ అసెంబ్లీనేనని ఇండియా టు డే సర్వే గట్టిగా చెబుతోంది.
కాంగ్రెస్‌పార్టీకి 54 స్థానాలు వస్తాయని, అధికార బీఆర్‌ఎస్(BRS) పార్టీ 49 సీట్ల దగ్గరే ఆగిపోతుందని అంటోంది. అధికారంలోకి వస్తామని పదే పదే చెప్పుకుంటున్న బీజేపీకి(BJP) రెండంకెల సీట్లు కూడా రావని, ఎనిమిది సీట్లకే అది పరిమితం కానున్నదని ఇండియా టు డే- సీ ఓటర్ సర్వే తెలిపింది. ఇతరులు ఎనిమిది స్థానాలలో గెలుస్తారని అంచనా వేసింది. ఈ లెక్కన ఏ పార్టీకి కూడా సింపుల్ మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సింపుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 స్థానాలు అవసరం.
కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెల్చిన పార్టీగా నిలుస్తున్నప్పటికీ 54 మార్క్ దగ్గరే ఆగిపోతున్నది. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య తేడా కేవలం అయిదు సీట్లు మాత్రమే. ఇతరులు గెల్చుకునే సీట్లలో ఏడు మజ్లిస్ పార్టీవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఒక స్థానం బీఎస్‌పీకి దక్కుతుందట! ఏ నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ గెలుస్తుందో సర్వే చెప్పలేదు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు మజ్లిస్ మద్దతు ఇచ్చినా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిసినా 56 సీట్లే అవుతుంది.
పోనీ బీజేపీతో బీఆర్‌ఎస్ జత కట్టినా కూడా సింపుల్ మెజారిటీకి మూడు సీట్ల దూరంలో నిలిచిపోతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ సపోర్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. క్రితంసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్‌కు 11 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ 9 శాతం ఓట్లను కోల్పోతున్నది. అయితే ఎన్నికలకు నెల రోజులకు పైగా సమయం ఉండటంతో సర్వే ఫలితాలలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మంచి వ్యూహకర్త కాబట్టి ప్రతికూల పరిస్థితులను అధిగమించగలరనే నమ్మకంతో గులాబీదళం ఉంది. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ ఇంకా విడుదల కాలేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితులు మారవచ్చు. మరోవైపు బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థలనే ఖరారు చేయలేదు. మొత్తంమీద నవంబర్ మొదటి రెండు వారాలలో చేసే సర్వేలో నిఖార్సైన జనాభిప్రాయం రావచ్చు. ఇప్పటికైతే మొగ్గు కాంగ్రెస్‌వైపే ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి.
అదే టెంపో కనుక కొనసాగితే సింపుల్ మెజారిటీ సాధించడం కాంగ్రెస్‌కు కష్టమైన పనేమీ కాదు. రాహుల్‌గాంధీ చెప్పినట్టు సునామీ కనుక వస్తే మాత్రం కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ రావచ్చు. రీజినల్ అవుట్‌రీచ్ సర్వే ఇదే చెబుతోంది. కాంగ్రెస్‌కు 75 స్థానాలు లభిస్తాయిని ఆ సర్వే అంటోంది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని సాధిస్తుందని చెబుతోంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 44 శాతం ఓట్లు లభిస్తాయని, బీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు జనాల్లోకి చేరాయని చెబోతంది.