తెలంగాణలో(Telangana) భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(Indian Meteorological department) హెచ్చ‌రించింది. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌కు సంబంధించి చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. తెలంగాణలో నిన్న భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌లోని ముగ్‌పాల్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మండలంలో 157.5 మి.మీ వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని అంబర్‌పేటలో అత్యధికంగా 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. TSDPS కూడా తెలంగాణా జిల్లాల్లో సెప్టెంబర్ 6 వరకూ వర్షపాతాన్ని అంచనా వేసింది. భారీ వర్షాల సూచన దృష్ట్యా.. తెలంగాణ వాసులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం చాలా కీలకం.

Updated On 4 Sep 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story