ద్వాల మండలం బీరేల్లి(Bireli) గ్రామంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వడ్ల కొనుగోలు సెంటర్‌లో గొడవకు దిగారు.

వడ్ల(Awadh Paddy Seeds) కొనుగోలు సెంటర్ లను ఐకేపీ సెంటర్(IKP Centers) ద్వారా రైతుల నుండి వడ్ల కొనుగోలు ప్రభుత్వం నిర్వహిస్తుండగా గద్వాల మండలం బీరేల్లి(Bireli) గ్రామంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వడ్ల కొనుగోలు సెంటర్‌లో గొడవకు దిగారు. వడ్ల కొనుగోలు సెంటర్ తమ వర్గానికే ఇవ్వాలని కొనుగోలు సెంటర్ ప్రారంభం కాకుండా ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. గత సంవత్సరం మహిళా సంఘాల వారికే వడ్ల కొనుగోలు సెంటర్‌ను ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని కొందరు పట్టు పట్టారు. రాజకీయ కారణంగానే బీరేల్లి గ్రామ కొనుగోలు సెంటర్‌ను ఈ సంవత్సరం వేరే మహిళా గ్రూప్ లకు ఇచ్చారాని గత సంవత్సర మహిళా సంఘాల గ్రూప్ వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గద్వాల నియోజకవర్గం లో అధికార పార్టీలోని నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడంతో గ్రామాలలో కూడా రెండు వర్గాలుగా కార్యకర్తలు, నాయకులు విడిపోయి గ్రామాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Eha Tv

Eha Tv

Next Story