తెలంగాణలో(Telangana) చలి(Cool Weather) తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు(Temperatures) భారీగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు.

TS Weather Updates
తెలంగాణలో(Telangana) చలి(Cool Weather) తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు(Temperatures) భారీగా పడిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఉదయం మంచు విపరీతంగా కురుస్తోంది. వాహనదారులకు బాగా ఇబ్బంది అవుతోంది. తొమ్మిది గంటల తర్వాత కానీ వాహనాలు రోడ్డెక్కడం లేదు. ఏజెన్సీ ప్రాంతాలలో(Agency Areas) అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా ఆరు డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రంగా చాలా ఎక్కువగా ఉంది. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత ఉన్నా , ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు అంటున్నారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
