తెలంగాణ రాష్ట్రంలో(Telangana) వచ్చే ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, భువనగిరి(Bhuvangir), జనగాం(Janagam), సూర్యాపేట(suryapet), కొత్తగూడెం, మంచిర్యాల(Mancherial), పెద్దపల్లి(Pedapalli), భువనగిరి, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో(Telangana) వచ్చే ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, భువనగిరి(Bhuvangir), జనగాం(Janagam), సూర్యాపేట(suryapet), కొత్తగూడెం, మంచిర్యాల(Mancherial), పెద్దపల్లి(Pedapalli), భువనగిరి, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ.వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్(Yellow Alert) జారీ చేసింది. మరికొన్ని జిల్లాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నాడు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నల్గొండ, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈనెల 10న కూడా పలు చోట్ల ఈదురుగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.