రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఆగస్టు 15 వరకు అవి కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఆగస్టు 15 వరకు అవి కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం.. గురువారం వరకూ హైదరాబాద్ నగరంలో సాధారణంగా ఆకాశం మేఘావృతమై.. వర్షపాతం న‌మోద‌వ‌వ‌చ్చు.

సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌ల‌లో ఉదయం 10 గంటల వరకు IMD హైదరాబాద్ ముందుగానే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ వాసులు తెల్లవారుజామున మేల్కోగానే వర్షం, క‌మ్మేసిన‌ నల్లటి మబ్బులను చూశారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story