హైదరాబాద్‌లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మరోసారి హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది.
హైదరాబాద్‌లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మరోసారి హీట్‌వేవ్ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం గత వారం నుంచి ఇది రెండోసారి. ఏప్రిల్ 6 వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక చెబుతుంది. అలాగే ఏప్రిల్ 7 ఆదివారం నాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో నిన్న రికార్డ్ స్థాయిలో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల్, వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లోనూ 43 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 41 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.