జూన్ 1 శనివారం నాడు నగరంలోని మొత్తం ఆరు జోన్‌లలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ

IMD Hyderabad forecasts rainfall in all zones of the city
జూన్ 1 శనివారం నాడు నగరంలోని మొత్తం ఆరు జోన్‌లలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా అంచనా వేసింది. శుక్రవారం నగరంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.
ఇక గురువారం ఉష్ణోగ్రత 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని హైదరాబాద్‌లోని ఐఎండీ అంచనా వేసింది. హైదరాబాద్‌లో శనివారం వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న కొద్దిరోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని ప్రకటనలో తెలిపింది.
