హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, ఉష్ణోగ్రత తగ్గుదలని అంచనా వేసింది

IMD Hyderabad forecasts heavy rainfall, dip in temperature in Telangana today
హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు, ఉష్ణోగ్రత తగ్గుదలని అంచనా వేసింది. మే 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్‌లో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. IMD హైదరాబాద్ ప్రకారం.. పగటిపూట వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు పడనున్నాయి, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని.. ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం.. నిన్న జగిత్యాలలో అత్యధికంగా అంటే 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ విషయానికొస్తే అత్యధికంగా షేక్‌పేటలో 43.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
