రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది

రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలోని జిల్లాలకు సెప్టెంబర్ 19 వరకూ వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. హైదరాబాద్‌లో బుధవారం వరకూ తేలికపాటి వర్షాలు లేదా చినుకులు పడే అవకాశం లేద‌ని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎలాంటి వర్షపాత హెచ్చరికలు జారీ చేయలేదు. నిన్న మంచిర్యాలలో అత్యధికంగా 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా.. హైదరాబాద్‌లో నగరంలో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు.

ప్రస్తుత నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సగటు వర్షపాతం 898 మిమీ నమోదైంది. సాధారణ వర్షపాతం 652.2 మిమీ కంటే 38 శాతం పెరిగింది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 532.1 మిల్లీమీటర్లకు గాను 703.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story