హైదరాబాద్ నగరంలో ఆగస్టు 7 వరకు వర్షాలు, ఉరుములతో కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ విభాగం (IMD) అంచ‌నా వేసింది.

హైదరాబాద్ నగరంలో ఆగస్టు 7 వరకు వర్షాలు, ఉరుములతో కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ విభాగం (IMD) అంచ‌నా వేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాల‌పై వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు, రేపు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళ, బుధవారాల్లో నగరంలో ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం బండ్లగూడలో మాత్రం ఓ మోస్త‌రు వర్షపాతం నమోదైంది. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌ ఐఎండీ అంచనా వేసిన విధంగా వర్షపాతం సాధారణ స్థాయికి మించి కురుస్తుందో లేదో చూడాలి మ‌రి.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story