తెలంగాణలో ఎండలు బాగా ముదిరాయి. మార్చి నెలాఖరులో ఇంతటి ఎండలను(Summer heat) మునుపెన్నడూ చూడలేదు. పొద్దుపొద్దున్నే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. సాయంత్రం వాతావరణం చల్లబడుతుందా అంటే అదీ లేదు. ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు అదిరిపోతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు(Temperature) మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) హెచ్చరించింది.

సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఆరెంజ్‌ అలర్ట్‌(Orange Alert) జారీ చేసింది. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌(Adilabad) జిల్లాలో నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు, జైనథ్‌ మండలాల్లో గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌,మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేశారు. గురువారం వేడిగాలులు కొనసాగుతాయని, భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ,మహబూబ్‌నగర్‌, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Updated On 28 March 2024 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story