రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది .

రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది . బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైనా కొంతమేరకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మంగళ వారం వాతావరణం మారిపోయింది.

మబ్బులు పట్టి చలిగాలులు(Cold Wave) వీచాయి. కాగా, వారం రోజుల కింద వణికించిన చలి.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఉత్తరాది జిల్లాలు మినహా దాదాపు రాష్ట్రమంతటా కొన్ని రోజులుగా రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్ సిటీలో రాత్రి టెంపరేచర్లు 17 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. మరోవైపు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. నల్గొండ జిల్లా మాటూరులో 1.1 సెంటీ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1.1 సెంటీ మీటర్ల మేర వర్షం పడింది.

Eha Tv

Eha Tv

Next Story