అది పేరుకే మసాజ్ సెంటర్. లోపలికెళ్తే మజాసెంటర్‌గా మారుతుంది. అదేనండీ మీరు అనుకున్నట్లే మసాజ్ సెంటర్ ముసుగులో కామకలాపాలు చేస్తారు.
అది పేరుకే మసాజ్ సెంటర్. లోపలికెళ్తే మజాసెంటర్‌గా మారుతుంది. అదేనండీ మీరు అనుకున్నట్లే మసాజ్ సెంటర్ ముసుగులో కామకలాపాలు చేస్తారు. హైదరాబాద్(Hyerabad) చందానగర్(Chandanagar) పీఎస్ పరిధిలో హైవేపై ఉన్న ఎస్‌వీఎల్ టవర్స్(SVL Towers)లో సాఫ్ట్ టచ్ పేరుతో మసాజ్ సెంటర్ ఉంది. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. దీంతో వీరి వ్యభిచార వ్యవహారం బయటపడింది. సాఫ్ట్‌టచ్ పేరుతో నిర్వహిస్తున్న స్పా సెంటర్‌లో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ సెంటర్ నిర్వాహకులు వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్(Jublile hills)లోని ఓ పబ్(Pub)లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీగా డ్రగ్స్ (drugs)పట్టుబడ్డాయి. దాదాపు 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. కస్టమర్లను పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే అనుమతించాలని, లేదంటే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు.