బీజేపీ(BJP) నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ధర్నా చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్(Parliament) పై దాడి జరిగితే సమాధానం లేదన్నారు. పార్లమెంట్ కి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీఏకు లేదు.. దేశానికి భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారని మండిపడ్డారు.

ఎంపీల గొంతు నొక్కుతూ సభ నుండి సస్పెండ్ చేశారని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా ప్రజలు ఆలోచించాలని అన్నారు. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిరంకుశత్వంతో ధర్నా చౌక్ ని తీసేసిందన్నారు. హైకోర్టు ధర్నా చౌక్ కి అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రజలంతా నియంతృత్వ ప్రభుత్వాన్ని తొలగించారని మంత్రి శ్రీధర్ బాబు(Sreedhar Babu) పేర్కొన్నారు.