చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా అని హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా అని హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్‌(Aminapur)లో భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చెయ్యాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కులుస్తారు అని తహశీల్దార్‌(MRO)పై ఫైరయింది. కూల్చివేతలు తప్ప హైడ్రాకు (Hydra)మరో పనిలేనట్లుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కోర్టులో పెండిగ్‌లో ఉన్న భవవనాన్ని ఎలా కూల్చుతారని ఆగ్రహించింది హైకోర్టు. ఇప్పటివరకు ఎన్నిచెరువులకు ఎఫ్‌టీఎల్‌(FTL) నిర్ధారించారు.. ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. అడిగిన ప్రశ్నలకే సమాధానమివ్వాలని.. స్కిప్‌ చేయకూడదని అమీన్‌పూర్ తహశీల్దార్‌కు చురకలంటించింది. అమీన్పూర్‌పై మాత్రమే మాట్లాడండి.. కావూరి హిల్స్(Kavuri Hills) గురించి మేం అడగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించింది. మూసి రివర్‌(Musi River) కట్టడాలపై 20 లంచ్ మోషన్ పిటిషన్లు ఉన్నాయి. అసలు హైడ్రాకు పాలసీ ఎక్కడుందో చెప్పాలని ఆదేశించింది. హైదరాబాద్‌(Hyderabad)లో ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కళ్లు మూసుకుని ఇళ్లు కూల్చేయాలని యంత్రాలను పంపిస్తున్నారా అని హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పద్దతి కాదు.. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం ఉండదు.. ప్రభుత్వరశాఖలకు ఆదాయం కావాలి.. రాజకీయనాయకుల కోసం, బాస్‌లను సంతృప్తిపరిచేందుకు పనిచేయకూడదని హైకోర్టు ఆదేశించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకే కూల్చివేశామన్న తహశీల్దార్‌పై మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చాలని కలెక్టర్‌ చెప్పారా అని ప్రశ్నించింది. అసలు ఆక్రమణలకు అనుమతిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలిపింది. ప్రభుత్వ భూములు రక్షిస్తే అండగా ఉంటామని.. కానీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమం అని హెచ్చరించింది హైకోర్టు.

ehatv

ehatv

Next Story