బీజేపీకి ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కేంద్రంపై బీఆర్‌ఎస్ (BRS) మండిపడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ( Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కెసిఆర్ (KCR) నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని.. లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని కవిత అన్నారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన ఉండేదని.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందన్నారు కవిత. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని..10 సంవత్సరాలకుపైగా అధికారంలో ఉన్న బిజెపి హామీని అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని.. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం సాకు చూపిస్తోందన్నారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారన్నారు. బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రకటించడం బాధాకరమని.. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని..కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదన్నారు. బిజెపి ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు.

ehatv

ehatv

Next Story