కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలను ఆ ప్రభుత్వంలోనే పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్(Smita sabarwal) కూడా తప్పుబట్టారు.
కొండా సురేఖ(Konda surekha) వ్యాఖ్యలను ఆ ప్రభుత్వంలోనే పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్(Smita sabarwal) కూడా తప్పుబట్టారు. మహిళలను రాజకీయాల(Politics) కోసం వాడుకోవడం తగదని సూచించారు. ఈ సందర్బంగా ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు స్మిత సబర్వాల్. 'ఈ సమాజంలో సెన్సేషన్ కోసం, థంబ్‌నెయిల్స్ పెట్టి మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. అధికారులను కూడా వదిలిపెట్టలేదు. నా వ్యక్తిగత అనుభవం ద్వారా నేను మాట్లాడుతున్నాను. కష్టపడి పైగా ఎదిగినవారిపై అపవాదులు వేస్తుంటారు. ఇప్పటికైనా మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలు గౌరవిద్దామన్నారు. మహిళా మంత్రి నుంచి అగౌరవప్రదమైన ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. సిట్టింగ్ మంత్రిగా ఉండి మహిళలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు హెల్దీ వాతావరణం సృష్టించుకుందాం' అని స్మితాసబర్వాల్ హితవు పలికారు.