IAS స్మితా సబర్వాల్ 12వ తరగతి మార్కుషీట్ వైరల్ అవుతుంది. స్మితా సబర్వాల్ జూన్ 19, 1977న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ కుటుంబంలో జన్మించారు.

IAS స్మితా సబర్వాల్ 12వ తరగతి మార్కుషీట్ వైరల్ అవుతుంది. స్మితా సబర్వాల్ జూన్ 19, 1977న పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆమె ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్(Pranab das), పురబీ దాస్ (purabhi das)కూతురు. కేవలం 23 సంవత్సరాల వయస్సులో స్మిత సబర్వాల్(SmitaSabharwal) యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, భారతదేశంలోని అతి చిన్న వయసు ఉన్న మహిళా IAS అధికారులలో ఒకరిగా చరిత్ర సృష్టించింది. తెలంగాణ(Telangana)లోని సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనేక మంది IAS అధికారులు వారి వారి ఫ్యాషన్ ఎంపికల కోసం కూడా ఇంటర్నెట్‌లో విస్తృతంగా అభిమానులను ఆకర్షించారు. ఆ జాబితాలో ఐఏఎస్ టీనా దాబీ, ఐఏఎస్ రియా దాబీ, ఐఏఎస్ స్మితా సబర్వాల్ నెటిజన్ల నుంచి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న సివిల్ సర్వెంట్లలో కొందరు. అయితే ఈ మధ్యే ఆమె తన 12వ తరగతి మార్కుషీట్‌ను X లో షేర్‌ చేశారు. IAS స్మితా సబర్వాల్ ఇలా వ్రాశారు, "#12వ తరగతి ఫెయిల్ అనేది ఒక స్ఫూర్తి! కానీ 12వ తరగతి ఉత్తీర్ణత ఒక మధురమైన జ్ఞాపకమని తెలిపారు.

ehatv

ehatv

Next Story