స్మితా సబర్వాల్(smita sabharwal) ఐఏఎస్(IAS) ..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గత ప్రభుత్వంలో సీఎంవోలో(CMO) కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు స్మితా సబర్వాల్. తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శిగా(Secretary, Irrigation Department) ఉన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు.
స్మితా సబర్వాల్(smita sabharwal) ఐఏఎస్(IAS) ..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గత ప్రభుత్వంలో సీఎంవోలో(CMO) కీలక అధికారిగా బాధ్యతలు నిర్వహించారు స్మితా సబర్వాల్. తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శిగా(Secretary, Irrigation Department) ఉన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ(Transfer) చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో.. సీఎంవో కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. అయితే..ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్(Tweet) చర్చకు దారి తీస్తోంది. ‘మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైనది..తలపైకి ఎత్తి బలంగా నడవాలి’ అంటూ ఎమోషన్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టును చూసిన ఆమె అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వాస్తవానికి.. ట్విట్టర్‌లో ఆమెకు ఉన్న ఫాలోవర్లు మరో అధికారికి లేరు. అసలు అంత కష్టం ఏమొచ్చింది మేడమ్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. మీరు ఒక గొప్ప సమర్ధత కలిగిన అధికారి..ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.. సవాళ్లను సానుకూలంగా, ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలి..అంటూ స్మితా సబర్వాల్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.