ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ నోట అదుర్స్ సినిమాలో జూ. ఎన్.టి.ఆర్. చెప్పిన కామెడీ డైలాగులు వస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ కామెడీ కాస్తా సీరియస్ అయ్యింది.
ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ నోట అదుర్స్ సినిమాలో జూ. ఎన్.టి.ఆర్. చెప్పిన కామెడీ డైలాగులు వస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ కామెడీ కాస్తా సీరియస్ అయ్యింది. ఆ డైలాగులు చెప్పిన ఐ.ఏ.ఎస్. ప్రశ్నలు అడిగిన వారి ఆగ్రహానికి గురికావలసి వచ్చింది.
రెండవ రోజు జరుగుతున్న కాళేశ్వరం కమీషన్ బహిరంగ విచారణలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత ప్రభుత్వం హయాం లో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అప్పటి సి.ఎస్. సోమేశ్వర్ కుమార్ నేడు విచారణకు హాజరు అయ్యారు. విచారణ సమయం లో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను గురించిన ప్రశ్నలు అడిగినపుడు.. సోమేశ్ కుమార్ సూటిగా సమాధానం చెప్పకుండా.. తెలియదు , గుర్తులేదు, చాలా రోజుల అయ్యింది కాబట్టి మర్చిపోయాను అంటూ సమాధానాలు చెప్పారు. ఆయన చెప్పిన సమాధానాలపై కమీషన్ సీరియస్ అయ్యింది.
అయితే కమీషన్ విచారణకు సోమేశ్ కుమార్ ను పిలిచినా వెంటనే రాకుండా ఆలస్యం చేసినందుకు.. ఆయన పైన కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమీషన్ ఎంతసేపు ఎదురుచూడాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే కమీషన్ ముందు హాజరైన మరో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ స్మిత సభర్వాల్ కూడా ఇలాంటి సమాధానాలే చెప్పారు.