తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గత ప్రభుత్వానికి వత్తాసు పలికిన అధికారులను తొలగించే పనిలో పడ్డారు. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై దృష్టి పెట్టారు. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం కల్పిస్తున్నారు. త్వరలోనే ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌ల(IPS) బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు ట్రాన్సఫర్‌ అయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గత ప్రభుత్వానికి వత్తాసు పలికిన అధికారులను తొలగించే పనిలో పడ్డారు. ప్రభుత్వంలో కొత్త టీమ్‌పై దృష్టి పెట్టారు. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం కల్పిస్తున్నారు. త్వరలోనే ఐఏఎస్‌(IAS), ఐపీఎస్‌ల(IPS) బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలో కమిషనర్లు ట్రాన్సఫర్‌ అయ్యారు. ఆయా శాఖల్లో పలువురు అధికారుల జాబితా కూడా సిద్దమైంది. శాఖల సమీక్షలు పూర్తి కాగానే బదిలీలు ఉంటాయట! ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందనే చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే సీనియర్‌ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌(Smita Sabharwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్‌ సర్వీసుల్లో(Central Service) వెళ్లడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్మిత సబర్వాల్‌ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు.రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా సబర్వాల్‌ ఏ సమీక్షకు హాజరు కాలేదు. స్మితా సబర్వాల్ టాలెంట్‌ను మెచ్చుకునే ఆమెను కార్యదర్శిగా నియమించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR).సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ(Mission Bhagiratha) పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్‌ ట్విట్టర్‌లో ఓ కామెంట్‌ చేశారు. తన 23 ఏళ్ల కేరీర్‌ గురించి ప్ర‍స్తావిస్తూ ఆమె ఫొటోను షేర్‌ చేశారు. కొత్త ఛాలెంజ్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానంటూ, మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్‌, ఆమ్రపాలిల(Amrapali) పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయానికి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు. మరొకరు అందులో అడుగుపెట్టాలనుకుంటున్నారు. స్మితా సబర్వాల్‌ సెంట్రల్‌ సర్వీసుల్లోకి వెళ్లాలని అనుకుంటుంటే, కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్ ఆమ్రపాలి.. రేవంత్ రెడ్డి టీమ్‌లో జాయిన్ కానున్నారు.

Updated On 13 Dec 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story