ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సీయూలో AI చిత్రాన్ని IAS అధికారిణి స్మితా సబర్వాల్ తన ఎక్స్ X లో రీ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే X హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఓ ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీ పోస్ట్ చేశారు. హెచ్ సీయూ లోపల మష్రూమ్ రాక్ ముందు భారీగా బుల్డోజర్లు వాటి ముందు జింక, నెమలి గిబ్లి శైలిలో ఉంది. ఈ పోస్ట్ ను స్మితా సబర్వాల్ తన ఎక్స్ లో రీ పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించి ఆమెకు నోటీసులిచ్చారు. 400 ఎకరాల భూముల్లో భారీగా బుల్డోజర్లు జింకలను, నెమల్లను తరిమేస్తున్నట్లు ఫోటోలు,వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ప్రభుత్వం ఆయా అకౌంట్లపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని స్మితా సబర్వాల్‌ కు బీఎన్ఎస్ సెక్షన్ 179(BNSS Section 179)కింద నోటీసులిచ్చినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. తనకు నోటీసులివ్వడంపై స్మితా సబర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. అయితే ఆమెకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చిన వెంటనే కంచె గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను, అందుకు సంబంధించిన వాదనలతో 'లైవ్‌ లా' చేసిన పోస్టును రీపోస్ట్ చేశారు స్మితా సభర్వాల్(Smita Sabharwal). దీంతో సుప్రీంకోర్టు కూడా ఏఐ జనరేటెడ్‌ వీడియోలతో ఫేక్‌ ప్రచారాన్ని చేశారన్న ప్రభుత్వ తరపు లాయర్‌ వాదనను తోసిపుచ్చిందని.. అదే తాను చేశానని ఆమె వెల్లడించినట్లయింది. సుప్రీంకోర్టు వాదనలను పోస్ట్ చేసిన 'లైవ్‌ లా' పోస్టును రీపోస్ట్ చేసి ప్రభుత్వానికి స్మితాసభర్వాల్ సవాల్ విసిరినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ehatv

ehatv

Next Story