హెచ్ఎండిఏలో(HMDA) జాయింట్ కమిషనర్‌గా(Joint Commissioner) బాధ్యతలు స్వీకరించిన ఆమ్రాపాలి(Amrapali). హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
హెచ్ఎండిఏలో(HMDA) జాయింట్ కమిషనర్‌గా(Joint Commissioner) బాధ్యతలు స్వీకరించిన ఆమ్రాపాలి(Amrapali). హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి(BLN Reddy), అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్(Dr.B Prabhakar), ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్‌రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్విసింగ్‌లతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ప్రభుత్వం తనకు కల్పించిందని అన్నారు.
అయితే.. వరంగల్ జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా ఆమ్రాపాలి సేవలందించారు. డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళ్లారు. 2020 నుంచి పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఆమె సేవలు 2026 వరకు ఉన్నా.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు