ఈ రోజుల్లో ఫ్రెండ్స్‌ను కూడా నమ్మేట్టు లేదు. ఎవరు మంచి మిత్రులో ఎవరు కాదో చెప్పడం కష్టమే! ఫ్రెండ్‌షిప్‌ను(Friendship) ఆసరా చేసుకున్న ఓ యువతి తన ఫ్రెండ్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీసింది. ఆ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసింది. తర్వాత అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువతులు ఒక హాస్టల్ గదిలో ఉంటున్నారు.
ఈ రోజుల్లో ఫ్రెండ్స్‌ను కూడా నమ్మేట్టు లేదు. ఎవరు మంచి మిత్రులో ఎవరు కాదో చెప్పడం కష్టమే! ఫ్రెండ్‌షిప్‌ను(Friendship) ఆసరా చేసుకున్న ఓ యువతి తన ఫ్రెండ్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీసింది. ఆ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసింది. తర్వాత అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువతులు ఒక హాస్టల్ గదిలో ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రూమ్మెట్స్(Roommates) కావడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు షేర్ చేసుకునేంత వరకు స్నేహం వెళ్లింది. కొన్ని రోజులకు సెలవులు రావడంతో తమ ఊరికి వెళదామని నిందితురాలు తన స్నేహితురాలిని తన ఇంటికి తీసుకెళ్లింది. రెండు రోజులు బాగానే ఉన్న నిందితురాలికి దుర్బుద్ధి పుట్టింది. స్నేహితురాలు గదిలో బట్టలు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియో తీసింది(changing videos). ఆ వీడియోను తనకు తెలిసిన యువకులకు పంపించింది. పాపం ఈ సంగతి బాధితురాలికి తెలియదు. కొద్ది రోజుల తర్వాత ఓ అన్‌నోన్ నంబర్ నుంచి వాట్సప్‌లో తను బట్టలు మార్చుకుంటున్న వీడియోలు వచ్చాయి. అది చూసి షాక్‌కు గురయ్యింది బాధితురాలు. తాము అడినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు అగంతకులు. బెదిరిపోయిన బాధితురాలు కొంత డబ్బు వారికి పంపించింది. మళ్లీ ఫోన్ చేసి మరింత డబ్బు డిమాండ్ చేశారు. దాంతో బాధితురాలు షీ టీమ్స్‌కు(She team) కంప్లయింట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన షీ టీమ్స్ బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించినప్పుడు బాధితురాలి ఫ్రెండే వీడియోలు తీసి తమకు పంపించిందని చెప్పారు. పోలీసులు ఆ యువకులతో పాటు బాధితురాలి ఫ్రెండ్‌ను కూడా అరెస్ట్ చేశారు.